ఎల్లో మీడియా, ఎర్ర పార్టీ బ‌దులు మీరే వెళ్లి రావచ్చుగా  బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  పోల‌వ‌రం ఎత్తుపై ఆరోప‌ణ‌లు చేస్తున్న ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు. ఎల్లోమీడియా, క‌మ్యూనిస్టు పార్టీల‌పై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎల్లో మీడియా, ఎర్ర పార్టీని పోలవరం ముట్టడికి పంపించే బదులు మీరే స్వయంగా వెళ్లి రావొచ్చుగా బాబు గారూ. టీవీ చర్చల్లో బిగ్గరగా అరిచే ఉద్ధండ మేధావులను వెంట పెట్టుకుని టేపులతో కొలతలు తీసుకోండి. ఏడాదిలో ప్రాజెక్టు నిర్మాణం ఎలా ఉరుకులు పెట్టిందో జనానికి చూపించినట్టవుతుందంటూ ట్వీట్ చేశారు.

మ‌రో ట్వీట్‌లో అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా ఈ రోజు కాలి నడకన తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగిందని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top