బీజేపీ గెలిస్తే టీడీపీ గెలిచినట్లు మురిసి పోతున్నారు

ఇంకొకరి గెలుపుతో పండుగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

 తాడేప‌ల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా చుర‌క‌లంటించారు.    తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ నేత రఘునందన్‌రావు విజయం సాధిస్తే టీడీపీ గెలిచిన‌ట్లు మురిసిపోతున్నార‌ని పేర్కొన్నారు. అక్కడ పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థి దొరకలేదని ఆయన ఆరోపించారు.

‘తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శికి దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు. అక్కడ బీజేపీ గెలిస్తే సొంత పార్టీ విజయం సాధించినట్టు మురిసి పోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్ల వింత ఇది’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top