ప్రైవేటు ఆపరేటర్ల కోసం చంద్రబాబు ఆర్టీసీని కొల్లగొట్టారు

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: ప్రైవేట్‌ ఆపరేటర్ల కోసం చంద్రబాబు ఆర్టీసీని కొల్లగొట్టారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు.  గతంలో ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ప్రైవేటు ఆపరేటర్ల ప్రయోజనాల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములను తనవాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణం కోసం లీజుకు ఇప్పించారని ఆరోపించారు. చంద్రబాబు ఆర్టీసీని మూసివేత దశకు తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కానీ ఏపీ సీఎం వైయస్‌ జగన్ మాత్రం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనీ, ఆర్టీసీకి తిరిగి ఊపిరి పోశారని ప్రశంసించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top