ఎక్కడ దాక్కున్నావ్‌ బాబూ..?

తన నిలదీస్తారని ఫరూక్, మమతలకు దొరకని చంద్రబాబు

లోకేష్‌ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు

ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌

అమరావతి: తనను ఎక్కడ నిలదీస్తారోనని చంద్రబాబునాయుడు జాతీయ నేతలకు అందుబాటులో లేకుండా పోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా వేశారు. ఎక్కడ దాక్కున్నావ్‌ బాబూ అంటూ ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ‘మోదీని గద్దె దింపేంత వరకు నిద్ర పోయేది లేదని దేశమంతా తిరిగి అందరినీ ఆగం పట్టించిన చంద్రబాబు కోసం ఫరూఖ్‌ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే దొరకడం లేదట. అందరినీ రెచ్చగొట్టి తను మాత్రం 370 రద్దుకు మద్ధతు ఇవ్వడంపై నిలదీయాలనుకుంటున్నారట‘ అని అన్నారు.

అంత అవమానాన్ని 3 నెలలకే మర్చిపోతే ఎలా?
అంతకుముందు, ‘మూడు శాఖల మంత్రి, మాజీ ముఖ్యమంత్రి తనయుడైనా లోకేష్‌ను మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయి..ఇప్పుడు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు అని కామెంట్‌ చేశారు. మంగళగిరిలో రూ.150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెలలకే మర్చి పోతే ఎలా?‘ అని మరో ట్వీట్‌ పెట్టారు. 
 

Back to Top