న్యూఢిల్లీ: భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు జగదీప్ ధన్‌కర్ కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి హృదయపూర్వక అభినందనలు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజ్యసభ చైర్మన్‌గా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, ప్రజల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో జగదీప్ ధన్‌కర్ జీ చారిత్రక పాత్ర పోషిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఉప రాష్ట్రపతిగా విజయం సాధించిన జగదీప్ ధన్‌కర్ ను ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి ప్రతిమను అందించి అభినందనలు తెలిపారు.
భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థి అయిన ధన్‌కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. అలాగే యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 15గా తేలింది. జగదీప్ ధనకర్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన విషయం విధితమే.