మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌: పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి  రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాన‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top