భూ కుంభ‌కోణాలు క‌ప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగుల‌ను ఉసిగొల్పుతున్నాడు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

 
న్యూఢిల్లీ: మాన్సాస్‌లో భూకుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నాడు అశోక్ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. మాన్సాస్ 295 ఎకరాల భూములపై స్పష్టతలేదు -150 ఎకరాల విక్రయాల్లో తేడాలు. చంద్రబాబు చుట్టాలను మాన్సాస్‌లో ప్రవేశపెట్టి మరీ భూదందా చేశారు. ఇదేనా నీ పాలన అశోక్? చేసిందే నువ్వైతే ఈఓకు లేఖలు రాయడం ఏమిటి? అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదాలు మార్మోగాయి. పోలీస్‌ ఆంక్షలు, జోరువానలోనూ కొనసాగిన ధర్నాలో వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పాల్గొన్నాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం కాకుండా జరిపే పోరాటానికి వైయ‌స్సార్‌సీపీ సంఘీభావం సంపూర్ణంగా ఉంటుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ప్రజారోగ్యంపై అత్యధిక శ్రద్ధ కనబరుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు వైద్య, ఆరోగ్య రంగంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఇప్పటికే 2,900 మంది మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ను నియమించిన ప్రభుత్వం ఈ నెలాఖరుకల్లా మరో 3,390 మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించనుంద‌ని మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top