ఇది ట్రయిలర్ మాత్రమే... అసలు సినిమాలో జైలుకు వెళ్లాల్సిందే

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయి రెడ్డి
 

తాడేప‌ల్లి:  వైయ‌స్  జగన్ ఏడాది పాలన ట్రయిలర్ మాత్రమేనని, అసలు సినిమా చూస్తే, చంద్రబాబు ఏమవుతాడోనని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, దోపిడీలు, స్కాములు చేస్తూ, దొరికి పోయిన దొంగల ముఠా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. 

వైయ‌స్ జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభవజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే" అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top