అప్పుడైనా ఎన్టీఆర్‌ ఆత్మ శాంతిస్తుంది

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 
 

తాడేపల్లి: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనాన్ని కరోనా ఆసుపత్రికి ఇస్తే అప్పుడైనా ఎన్టీఆర్‌ ఆత్మ శాంతిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను కరోనా హాస్పిటల్ కు ఇస్తే తెలంగాణా ప్రజల రుణం తీర్చుకున్నట్టవుతుందని బాబుకు అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు కనబర్చాలి. పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మ కూడా శాంతిస్తుందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
 
ఆయన ఎవరి చేతిలో పావుగా మారాడో..
కేంద్రానికి తానే లేఖా రాయలేదని నిమ్మగడ్డ ANI వార్తా సంస్థకు చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు వెళ్లేటప్పటికి కాదు నేనే రాశా  అన్నాడు. లెటర్ బయటి నుంచి వచ్చిందని సిఐడి ప్రాథమికంగా నిర్థారించింది. 35 ఏళ్లు సివిల్ సర్వెంట్ గా చేసిన వ్యక్తి ఎవరి చేతిలో పావుగా మారాడో గ్రహించాలని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు. 
 

Back to Top