మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి

 వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: 'మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలని, వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉందని నారా లోకేష్‌ను ఉద్దేశించి వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  ఏపీలో 4.5 లక్షల మంది వాలంటీర్లపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు ఆయన కౌంటర్‌ ఇస్తూ ట్వీట్ చేశారు. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

Back to Top