బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: చంద్రబాబు తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లాడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంగిట బెల్లం ఆత్మలో విషం అనేది చంద్రబాబు నైజాన్ని వర్ణించడానికి పుట్టింది. పైకి ఎక్కడ లేని ప్రేమ నటిస్తాడు. చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top