కోడెల ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు

ట్విట్టర్ లో ఎంపీ విజయసాయిరెడ్డి
 

అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేసిన చంద్రబాబు, ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. గతంలో తాను కొనుగోలు చేసిన 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత వదిలేశాడని విమర్శించారు. నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top