40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఇలా..

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:  టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ రాజ‌కీయాల్లో అనుస‌రిస్తున్న తీరును ట్విట్ట‌ర్ వేదిక‌గా వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎండ‌గ‌ట్టారు. తండ్రీకొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని అనుకోలేదు. పచ్చ పార్టీ భవిష్యత్తును ఎల్లో మీడియాకు అప్పగించారు. ఇంకో రకంగా చెప్పాలంటే GPA రాసిచ్చారు. వాళ్ల కథలకు మురిసిపోతూ ప్రజాక్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఇలా సాగుతోంది అంటూ ట్వీట్ చేశారు.

వీళ్ల‌ను ఇంకేమనాలి
ఫీజుల నియంత్రణపై పిల్లలు, పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు. కార్పోరేట్ యాజమాన్యాలు నోరు మెదపలేదు. జనాలు వెంట పడతారన్న భయంతో బాబూ కిక్కురు మనడం లేదు. ప్రజలతో ఏ సంబంధం లేని అనుకుల మీడియా గోల చేయడమేంటో? వీళ్లు బాబుకు కట్టు బానిసలు కాక ఇంకేమనాలి అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top