వివరణలు ఇవ్వడం ఎర్రగడ్డ స్పెషాలిటీ!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

న్యూఢిల్లీ: 'ఎర్రగడ్డ' మతి చలించిన ప్రేలాపనలు  కొన్నాళ్లు వినక తప్పదు. గత కాలపు జ్ణాపకాలు, తానెవరికీ అను’కులం కాదని పదే పదే చెప్పే నీతిసూక్తులు కామన్ కదా. ఏ పక్షపాతం లేని వాళ్లు ఇలాంటివేవీ చెప్పనవసరం లేదు. తనకు తానే అనుమానపడి వివరణలు ఇవ్వడం ఎర్రగడ్డ స్పెషాలిటీ! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

రాజ్యాంగబద్ధ పదవి ముసుగులో ఆ 'చంద్ర'ముఖి ఆత్మ రాష్ట్రంలో తిరుగుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. విధులను గాలికొదిలేసి రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతోంది. మరో  రెండు నెలల్లో దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది! అంటూ మ‌రో ట్వీట్ చేశారు.

గుళ్లు కూలగొట్టి, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన స్లీపర్ సెల్స్ కు బాబు కొత్త ఎజెండాను అప్పజెప్పినట్టుంది. సడన్ గా నిలిచిపోయాయి. పంచాయతీల్లో కులాలు, మతాల మధ్య, పేదల మధ్య చిచ్చుపెట్టే అసైన్ మెంటు ఇచ్చి ఉంటాడు. ఘర్షణలు రెచ్చగొట్టి రక్తపాతాలు సృష్టించడం బాబుకు కొత్తేం కాదు అంటూ ఆదివారం ఉద‌యం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top