ప్రజల పట్ల అదే శ్రద్ధ కనబర్చడం సిఎం జగన్‌కే సాధ్యం 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: కుటుంబ సభ్యులు ఆపదలో ఉంటే ఎలా స్పందిస్తారో ప్రజల పట్ల అదే శ్రద్ధ కనబర్చడం సిఎం జగన్ గారికే సాధ్యమంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. మత్య్సకారులను గుజరాత్ నుంచి శ్రీకాకుళం తరలిస్తున్న స్లీపర్ బస్సుల ఫోటోలను చూశారు కదా. 2 వేల కిమీ జర్నీ మరి. ఆసుపత్రుల్లో కరోనా రోగులకిస్తున్న పౌష్టికాహారం గురించి వింటున్నాం. 
 
ఆ వింతనూ చూడాలి..
కరోనాను కంట్రోల్ చేసే స్విచ్చే మా దగ్గరుంది. మా దరిదాపుల్లోకి కూడా రాదు. ప్రధాని చెప్పినా సరే ముఖానికి మాస్క్ కట్టుకునేది లేదని తండ్రీకొడుకులు సవాళ్లు విసురుతున్నారట. ఆ వింతనూ చూడాలి. మనకు మాస్క్ జీవితంలో భాగమవుతుందని మోదీ గారు చెప్పడాన్ని కూడా తప్పు పడుతున్నట్టున్నారంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top