చంద్ర‌బాబు తన శిష్యుడికి టీపీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో అనుస‌రిస్తున్న తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి  తెచ్చుకున్నాడు అంటూ ట్వీట్ చేశారు.

బాబా మజాకా! 
కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి  తోలాడు. బాబా మజాకా! అంటూ ట్వీట్ చేశారు. 

మహా వృక్షం నలువైపులా విస్తరించి నీడను పరుస్తుంది. ఎన్నో పక్షులకు ఆవాసం అది. ఒక దుర్జనుడి బుర్రకి అది మరోలా కనిపించింది. కొమ్మల భారానికి వృక్షం కుంగి ఆవస్థ పడుతోందని అనుకున్నాడు. కొమ్మలు నరికి మోడును మాత్రం మిగిల్చి మురిసిపోయాడు. ఆ మూర్ఖుడి పేరు ఏ ‘లోకమో’ చెప్పుకోండి? అంటూ అంత‌కు ముందు మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top