బాబుకు నిద్రపట్టడం లేదనుకుంటా!

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి

న్యూఢిల్లీ:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో వర్షాలు పుష్క‌లంగా కురుస్తున్నాయ‌ని, ఈ ప‌రిణామం చంద్ర‌బాబుకు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు. వరదనీటితో కొన్నిచోట్ల ప్రజలు ఇబ్బందిపడ్డా వరుణుడు (బాబు లేనందుకు) పుష్కలంగా వర్షాలు కురిపిస్తున్నాడు. ఖరీఫ్ సీజన్ ఈసారి త్వరగా మొదలైంది. జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు వారాల్లో ప్రధాన రిజర్వాయర్లు నిండుతాయి. కరువుకు ప్రతిరూపం బాబుకు నిద్రపట్టడం లేదనుకుంటా అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

అసమాన శౌర్య పరాక్రమాలతో పాక్ దురాక్రమణను తిప్పికొట్టి భారత సైన్యం కార్గిల్ గడ్డపై విజయపతాకను ఎగరేసిన రోజు ఇది. కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా ఆ అద్భుత క్షణాలను గుర్తుచేసుకుంటూ ఈ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు గౌరవ వందనం సమర్పిస్తున్నాను అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top