కప్పం  చంద్రబాబుకు కడుతున్నావా...పప్పు నాయుడుకా? 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:   టీడీపీ నేత అశోక్ గ‌జ‌ప‌తి రాజు తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు.  శుక్ర‌వారం ఆయ‌న వ‌రుస ట్వీట్ల‌తో  టీడీపీ నేత‌ల తీరును తూర్పార‌బ‌ట్టారు. 
తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక. ఫ్రెంచ్, బ్రిటిష్ వారితోపాటు పొరుగు రాజ్యం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించారు గానీ విజయరామ గజపతిలా విదేశీయుల  ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదు వారు.

గజపతులంటే ప్రజల పక్షాన ఎన్నడూ నిలబడని మోతుబరి జమిందారులు. గోల్కొండ సుల్తానులు, తర్వాత నిజాం నవాబులకు బానిసలు. ఫ్రెంచ్ జనరల్  బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బ తీశారు. ప్రజలను పీడించి బ్రిటిష్ వారికి కప్పం కట్టేవారీ గజపతులు.  

స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ తో కలిసి ప్రజలను హింసించారు గజపతులు. పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? కప్పం  చంద్రబాబుకు కడుతున్నావా...పప్పు నాయుడుకా? ఎన్టీఆర్ కు వెన్నుపోటుకు మీ పూర్వీకులే స్ఫూర్తా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు చేపట్టిన ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలు రాయిని దాటింది. గత రెండేళ్ల కాలంలో వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,00,116.36 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసింది. 6,53,12,534 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారని అంత‌కుముందు ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top