ట్ర‌క్ డ్రైవ‌ర్ల ప‌ని గంట‌ల నియంత్ర‌ణ ఆహ్వానించ‌ద‌గిన నిర్ణ‌యం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రక్  డ్రైవర్ల పని గంటలను నియంత్రిస్తామని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ  ప్రకటించడం ఆహ్వానించదగినదని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షా 51 వేల మంది చనిపోగా అందులో 15 వేల మంది డ్రైవర్లు, ట్రక్కుల్లో  ప్రయాణిస్తున్నవారే కావడం ఆందోళనకరమ‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని దివంగత సీఎం శ్రీ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు. ఆ మహానేత తనయుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు కూడా ప్రజల పట్ల అంతే వినమ్రంగా ఉంటారు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు అందించిన అపూర్వ విజయం మరింత బాధ్యతను పెంచిందని వైయ‌స్ జగన్ గారు పేర్కొన్నారని విజ‌య‌సాయిరెడ్డి అంత‌కుముందు మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top