విశాఖ‌ను అభివృద్ధి చేయ‌డ‌మే లక్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కీలక నిర్ణయం తీసుకున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  విశాఖ నుంచి భోగాపురం వరకూ 570 ఎకరాల్లో రూ.1,021 కోట్ల వ్యయంతో విశాఖ బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంకల్పించారు.

చంద్ర‌బాబు చరిత్ర హీనుడిగా మిగిలాడు
చంద్రబాబు విజన్ లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అంశాల కంటే దేనిపైన ఎంత కమిషన్ వస్తుంది. తన వాళ్లు ఎందరు కోటీశ్వరులవుతారు. ఓటుకు ఎన్నివేలు పెట్టి కొనగలం అనేవి అంతర్లీనంగా కనిపిస్తాయి.14 ఏళ్లు సిఎంగా చేసి అత్యంత విఫల పాలకుడిగా, చరిత్ర హీనుడిగా మిగిలాడ‌ని అంత‌కు ముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top