చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం..

విశాఖ‌:  దిశ యాప్ పై త‌ప్పుడు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న నారా లోకేష్‌పై వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందితే పొందావు. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం. యాప్ తో రక్షణ పొందిన వారి పేర్లు పోలీసు విభాగం దగ్గర దొరుకుతాయి. అడిగి తెలుసుకో అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం మన విశాఖలో ప్రారంభించడం గర్వంగా ఉంది. 25 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న ఈ  సౌర విద్యుత్ కేంద్రాన్ని సింహాద్రి ఎన్టీపీసీ రిజర్వాయర్ పై 75 ఎకరాల్లో రూ. 110 కోట్లు వెచ్చించి నిర్మించారని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top