బాబు హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: పోతిరెడ్డిపాడును తానే కట్టానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. గతంలో తమిళనాడు  సీఎం జయలలిత కుమార్తెనని ఎవరో అమ్మాయి కోర్టుకెక్కడం, హీరో ధనుష్ తమ కుమారుడే అని ఇంకొకాయన హంగామా చేయడం చూశాం. పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని చంద్రబాబు సిగ్గులేకుండా క్లెయిం చేసుకోవడం కూడా అలాంటి సంచలనమే. ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు.
 
బాబుకు వాళ్లతో సంబంధాలుండటం యాధృచ్ఛికమేం కాదు
బ్యాంకులను ఎవరు కొల్లగొట్టినా బాబుకు వాళ్లతో సంబంధాలుండటం యాధృచ్ఛికమేం కాదు. తాజాగా ఆర్థిక నేరగాడు బిఆర్ శెట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాకు 1800 కోట్లు ఎగవేశాడు. అమరావతిలో వేల కోట్లతో హెల్త్ సిటీ పెడుతున్నాడని అప్పట్లో వెంటేసుకుని తిప్పాడు. హవాలా డీల్స్ లో ఈయనకు సాయం చేస్తుంటాడని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top