విశాఖ: పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పంటలకే కాదు విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు, నగర దాహార్తిని తీర్చేందుకు...పోలవరం నుంచి నీరు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో చారిత్రక ఘట్టాలే ఇందుకు సాక్ష్యం. 60 రోజుల్లోనే 192 గడ్డర్ల ఏర్పాటు పూర్తి. భారీ వరదలొచ్చినా పనులు ఆగవు అంటూ విజయసాయిరెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. పాత్రికేయలోకానికే సిగ్గుచేటు విశాఖలో సునామీలు, భూకంపాలంటూ హడావుడి చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైనా విషం చిమ్ముతోంది. ఈ రాతల వెనుకున్న అజెండా ప్రజలకు తెలియదా! కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేయాలంటూ ప్రచారం చేసే కరపత్రికల స్థాయికి కుల మీడియా దిగజారడం పాత్రికేయలోకానికే సిగ్గుచేటు అంటూ అంతకుముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.