గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు అరుస్తూ నిద్ర చెడగొడుతుంటాయి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: పెంపుడు జాగిలాలు పద్ధతిగానే ఉన్నా వీధుల్లోని గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు అరుస్తూ నిద్ర చెడగొడుతుంటాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. కరిచేంత ధైర్యం లేకున్నా చికాకు పెడుతుంటాయి. మున్సిపల్ సిబ్బంది వ్యాన్లలో తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి వదిలిన తర్వాత గోల తగ్గిస్తాయట.

ఏపీ అరుదైన రికార్డు..
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఏపీ అరుదైన రికార్డ్‌ నెలకొల్పింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ చేపట్టగా ఒక్కరోజులోనే 13 లక్షల మందికి పైగా వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సిన్‌ వేసింది. ఒకే రోజు 13.60 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం దేశంలోనే రికార్డు అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top