అప్పట్లో ఎల్లో మీడియా డప్పుకొట్టేది

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: చంద్రబాబు పాలనలో అంతా తానే చేసినట్లు బిల్డప్‌ ఇచ్చేవారని, ఆయన ఏదో చేసినట్లు ఎల్లో మీడియా డప్పు కొట్టేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. గురువారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కలెక్టర్లు, ఎస్పీలే తన బలం అంటూ సీఎం జగన్ గారు అధికార యంత్రాంగాన్ని ఆదరించిన తీరును గమనిస్తున్నావా బాబూ? అప్పట్లో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడాలు. దిశానిర్దేశాలుండేవి. అంతా తమరే చేస్తున్నట్టు బిల్డప్పులుండేవి. విరుచుకు పడ్డట్టు, రంకెలేసినట్టు ఎల్లో మీడియా డప్పుకొట్టేది.

బాబుకు మనసొప్పలేదు
బాబు ఐదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు, జన్మభూమి కమిటీలు, ఇసుక మాఫియా మాత్రమే బాగుపడింది. 2.5 లక్షల కోట్ల రుణాలు, 60 వేల కోట్ల కాంట్రాక్టర్ల బకాయిలు, 20 వేల కోట్ల కరెంటు అప్పు వదిలి వెళ్లాడు. పేద ప్రజలకు రూపాయి ఇవ్వడానికి మనసొప్పలేదు. గ్రాఫిక్స్ ను దాటి ఒక్క పని గ్రౌండ్ కాలేదంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.
 

Back to Top