చంద్రబాబు గారూ...మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తారా?

వైయస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

తాడేపల్లి: ఎల్జీ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా అని చంద్రబాబు అడిగారని, ముందు ఆయన ఇంట్లోంచి బయటకు వస్తారా? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా? అంటూ బుధవారం విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదంటూ ట్విట్‌ చేశారు.

Back to Top