తాడేపల్లి: బీసీలను ఎదగకుండా చేసిన ఘతన చంద్రబాబుదేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ వర్గాలని సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతున్నారు. వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా 56 కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లు, సభ్యులను నియమిస్తే పచ్చ పార్టీ గంగవెర్రులెత్తుతోంది. బీసీలను ఎదగకుండా చేసిన ఘనత బాబు గారిదని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బీడు భూములు కోనసీమను తలపిస్తున్నాయి సీఎం వైయస్ జగన్ గారి హయాంలో రాయలసీమలో సేద్యంపై మళ్లీ ఆసక్తి , ఆదరణ పెరిగింది. ఇరిగేషన్ సదుపాయాలవల్ల భూములన్నీ పచ్చగా మారాయి. వరుణదేవుడు కరుణతో బీడు భూములు మళ్ళీ సాగుకు నోచుకుని కోనసీమను తలపిస్తున్నాయి. అందుకే అనేది జగన్ గారిది రైతు ప్రభుత్వమని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.