బాబూ లోకాయ్‌.. ఆ డబ్బు నువ్వు తిన్నావా? మీ నాన్న తిన్నాడా? 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి  
 

తాడేప‌ల్లి:  'బాబూ లోకాయ్‌... స్టాన్‌ఫర్డ్‌, కార్నెగీల్లో చదువుకున్నానని అంటావ్.. సొంత పేర్లతో ఉన్న కంపెనీలను సూట్ కేస్‌ కంపెనీలు అనరు నాయనా. కాస్త లోకజ్ఞానం నేర్చుకో లోకాయ్‌' అని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి  ఎద్దేవా చేశారు. 'లోకాయ్‌... మీ నాన్న పీఎస్‌ ఇంటి మీద రైడ్ తర్వాత, 2,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు అక్రమ మార్గాల్లో లాగేశారన్న నిజాన్ని ఐటీ శాఖ ప్రకటించింది. మొన్న ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి అసలు కారణం అదేనా? ఆ 2,000 కోట్లు నువ్వు తిన్నావా, మీ నాన్న తిన్నాడా? లేక జాయింట్‌ అకౌంటా?' అని విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రశ్నించారు.

Back to Top