తాడేపల్లి: రాష్ట్రంలోని ఓ వర్గం మీడియా అనుసరిస్తున్న విధానాన్ని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్, బిజెపి 4వ స్థానానికి పతనమైందని ఫ్రంట్ పేజీలో రాసింది బాబు అను’కుల మీడియా. 21 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన టీడీపీ 80% పంచాయతీల్లో చిత్తయినా, వైయస్సార్ కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని కనీసం వార్తగా ప్రచురించడానికి నామోషీ అడ్డొచ్చింది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.