ఇన్నాళ్లు మీ హిందూత్వం ఎటుపోయింది అశోక్‌?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి

విశాఖ:  టీడీపీ నేత అశోక్ గ‌జ‌ప‌తి రాజు వ్యాఖ్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా తిప్పికొట్టారు. ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటు పోయింది అశోక్? మీరు ఛైర్మన్ గా ఉన్న  గుళ్లోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారు? మాన్సాస్ లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయింది? మీరు మంత్రిగా వెలగబెట్టినప్పుడే మోతీ మహల్ కూల్చారు. అప్పుడెక్కడికి పోయింది మీ చారిత్రక  వారసత్వం? అంటూ విజ‌య సాయిరెడ్డి నిల‌దీశారు.

రాజ‌కీయాల్లో అలాంటివి ఏముండ‌వు మాలోకం..
అధికారంలోకి రాగానే అందరి ఖాతాలు సెటిల్ చేస్తావా? క్యాసినోలో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించడం అనుకున్నావా. కోడి పందేల్లో ఓడి కొత్త పుంజుతో పోటీకి  దిగినట్టా? రాజకీయాల్లో సెటిల్మింట్లు, రాసి పెట్టుకోడాలు, తేల్చుకోవడాలు ఏముండవు మాలోకం. గెలుపు, ఓటమి..ఈ రెండే ఉంటాయి అంటూ అంత‌కు ముందు ట్వీట్‌లో  విజ‌య సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top