మత్తు డాక్టర్ ను పచ్చపార్టీ వాళ్లు రోడ్డున పడేశారు

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకుతున్న మత్తు డాక్టర్ ను పచ్చపార్టీ వాళ్లు రోడ్డున పడేశారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే  పోలీసులు మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

చంద్రబాబుది ఆ కేసే! 
కరోనాతో ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడు చంద్రబాబు. ఎదుటి వారి దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించే వారిని సైకాలజీలో శాదన్ ఫ్రాయిడా (schadenfreude) అనే రుగ్మతకు గురైన వారిగా భావిస్తారు. బాబుది ఆ కేసే! అంటూ మరో ట్వీట్‌ చేశారు.

Back to Top