తాడేపల్లి: చావులనూ వివాదం చేయడం దివాళాకోరు రాజకీయం అవుతుందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు శవ రాజకీయాలను ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ఎవరు రాలిపోయినా రాబందులాగా చంద్రబాబు అక్కడ వాలిపోతున్నారు. విషాదంలో ఉన్న ఉన్న వారిని మరింత క్షోభకు గురిచేస్తున్నాడు. కొన్ని చోట్ల ఈయన వెళ్ళేదాకా అంత్యక్రియలు జరగకుండా పచ్చ బ్యాచ్ అడ్డుకుంటోంది. చావులనూ వివాదం చేయడం దివాళాకోరు రాజకీయం అవుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
సచివాలయాలు సరికొత్త రికార్డు
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి గారు ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల వ్వవస్థను నీతి అయోగ్ సహా అన్ని రాష్ట్రాలు కొనియాడాయి. గ్రామస్థాయిలోనే అన్ని ప్రభుత్వ పనులు జరిగేలా 15,004 సచివాలయాలు 34 శాఖలకు సంబంధించిన 543 సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 3.52 కోట్ల వినతులు పరిష్కారమవడం సరికొత్త రికార్డు సృష్టించారని విజయసాయిరెడ్డి అంతకు ముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.