ఐదేళ్లు ఎందుకు పట్టించుకోలేదో నిలదీయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్యద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్యద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంపూర్ణ వికాసం కోసం శాటిలైట్‌ పౌండేషన్‌, ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌, ప్రీ హైస్కూల్స్‌, హైస్కూల్స్‌,  హైస్కూల్‌ ప్లస్‌ ఇలా ఆరు రకాల స్కూళ్లను అందుబాటులోకి తెస్తున్నారు.
 
అన్ని సదుపాయాలతో ఆకర్షణీయంగా తయారైన ప్రభుత్వ స్కూళ్లు పిల్లలకు స్వాగతం పలుకుతున్నాయి. బాబు, లోకేశం ఏదైనా అలాంటి స్కూలు దరిదాపులకు వెళ్తే పేరెంట్స్ వారిని తోడ్కొని వెళ్లి పిల్లలతో కళకళలాడుతున్న ఆ  విద్యా(ఆ)లయాలను చూపించాలి. ఐదేళ్లు ఎందుకు పట్టించుకోలేదో నిలదీయాల‌ని విజ‌య సాయిరెడ్డి పిలుపునిచ్చారు. 

Back to Top