తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నీ స్నేహితుడైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయను శరణార్థిగా సింగపూర్ అనుమతించడం లేదట. రాజభవనంలో ఉండాల్సినోడిని నీ చెత్త సలహాలతో శరణార్థిగా మార్చేశావు చంబా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అమరావతిని కొలంబో చేస్తానని హామీ ఇచ్చావు. నిన్ను దింపి ప్రజలు రాష్ట్రాన్ని, తమను తాము కాపాడుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నిన్నే కొలంబో పంపిస్తారు అంటూ మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తలిదండ్రులు మరణిస్తే తలకొరివి పెట్టనోడివి, సోదరుణ్ణి గొలుసులతో బంధించినోడివి. లోకేష్ తాత ఎవరంటే ఖర్జురనాయుడు పేరు దాచిపెట్టి ఎన్టీఆర్ అంటూ ప్రచారం చేస్తున్నోడివి. నువ్వు కుటుంబం విలువలు గురించి మాట్లాడటం ఏంటి చంబా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.