నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది బాబు గారికి కదా!

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ఎదుటి పార్టీ ఎమ్మెల్యేల‌ను వేలం ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు అని నిరూపించిన చంద్ర‌బాబుకు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధ‌వారం విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబుపై సెటైర్లు వేశారు. అర్రె...వేలం పాటలో కొత్త థియరీ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది బాబు గారికి కదా! ఎవరికో ఇవ్వడమేంటి! వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బాబు ఎప్పుడో  కొత్త వేలం విధానాన్ని కనిపెట్టిన సంగతి నోబెల్ కమిటీ దృష్టికి వెళ్లలేదా? ఇప్పటికైనా ఆయన పేరు చేర్చి న్యాయం చేయాలి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top