విలువల పునాదిపై వెలిసిన పార్టీ మాది..

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువ‌ల పునాదిపై వెల‌సిన పార్టీ అని  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ చీకటి స్నేహాలు ఉండవు. నిజంగా కలిసి పనిచేయాల్సి వస్తే మా అధినేత జగన్ గారు బహిరంగంగానే ప్రకటిస్తారు. చంద్రబాబులా అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకోవడాలు, చాటు మాటు స్నేహాలు, రహస్య సంసారాలు మాకుండవు. విలువల పునాదిపై వెలిసిన పార్టీ మాది అంటూ విజ‌య‌స‌సాయిరెడ్డి  ట్వీట్ చేశారు.

అను'కుల'కోటను దాటి ఎల్లో మీడియా  ఆలోచించలేకపోతోంది

 రాష్ట్ర ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ‌పై ఎల్లో మీడియా విషం క‌క్కుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. బావిలో కప్పల్లా పచ్చమీడియా పైత్యం చూపించుకుంటోంది. తన అను'కుల'కోటను దాటి ఆలోచించలేకపోతోంది. ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్కానీలాంటిదని యూకే హై కమిషనర్ ఫ్లెమింగ్ చెప్పారు. అవకాశాలు మెండు, పెట్టుబడులకు అనుకూలం. రాజధానికి, నివాసయోగ్యానికి అనుకూలమైన నగరం మన విశాఖ అంటూ  విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top