బాబు శోకాలు పెట్టడం తప్ప చేయగలిగేదేం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నప్పుడు చాలా మంది విచక్షణ కోల్పోతారు. ప్రజల తిరస్కారంతో పొరుగు రాష్ట్రంలో ఆశ్రయం. ప్రతి ఎన్నికా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది.  కనుచూపు మేరలో సానుకూలత కనిపించని పరిస్థితి. బాబు, ఆయన బానిస మీడియా శోకాలు పెట్టడం తప్ప చేయగలిగేదేం ఉంటుందని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

రాష్ట్రంలోని పేదల కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు చేపట్టిన గృహ నిర్మాణ యజ్ఞం జాతీయస్థాయిలో ప్రశంసలు పొందుతోంది. 17,005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రపంచంలోనే అరుదు అని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ప్రశంసించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top