మిరప ఎగుమతులకు మరింత ఊతం

వైయస్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

అమ‌రావ‌తి: గుంటూరులో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని నా అధ్యక్షతన కామర్స్ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. దీనివల్ల మిరప ఎగుమతులకు మరింత ఊతం వస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. గుంటూరు కేంద్రంగా నెలకు1.8 లక్షల టన్నుల మిరప ఎగుమతవుతోంది. కోల్డ్ స్టోరేజీలుఏర్పాటు చేస్తే సీజన్లో తక్కువ ధరకే మిరప అమ్ముకునే సమస్య తప్పుతుంద‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

నీట్ పరీక్షకు  హాజరైన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మంది డాక్టర్లు తయారై ... ప్రజలకు సేవచేయాలన్నది నా అభిలాష. తెలుగు విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి. ఆ దిశగానే మన విద్యావిధానం రూపొందించారు సీఎం వైయ‌స్ జగన్ గారు...అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top