సిఎం వైయ‌స్ జగన్ గారంటే భరోసా..

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌: సిఎం వైయ‌స్ జగన్ గారంటే భరోసా, మూర్తీభవించిన మానవత్వం అని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. కరోనా రోగులకు  చికిత్స చేస్తూ ఆ మహమ్మారి బారినపడి ఊపిరితిత్తులు దెబ్బతిన్న కారంచేడు డాక్టర్ భాస్కర్ రావు లంగ్స్ మార్పిడి చికిత్స విజయవంతమై కోలుకున్నారు. చికిత్స ఖర్చు దాదాపు 2 కోట్లు సిఎం గారి ఆదేశాలతో ప్రభుత్వమే భరించిందంటూ ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

బాబు హయాం చేనేత రంగానికి చీకటి రోజులు. 2018 ఆగస్టులో ఎన్నికల ముందు బాబు ఒంగోలులో ఇచ్చిన ఉత్తుత్తి హామీలను నేతన్నలు ఎన్నటికీ మరవరు. ఆఫ్ సీజన్లో నేతన్నల ఉపాధికి 8,000 కోట్లిస్తానని మెరుపులు మెరిపించాడు. ఆప్కోకు బాకీ పడిన 50 కోట్లు కూడా చెల్లించకుండా నిష్క్రమించాడు అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top