ఒక పిశాచంలా  దాపురించాడు చంద్రబాబు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చంద్ర‌బాబు ఒక పిశాచంలా దాపురించాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు.  అప్పట్లో పోతిరెడ్డిపాడు విస్తరణ నిలిపేయాలని ప్రకాశం బ్యారేజిపై ధర్నాలు చేయించాడు. కృష్ణా డెల్టా ఎడారి అవుతుందని దుష్ప్రచారం చేశాడు. రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లో జనం చెప్పుతో కొట్టాక రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదని కసి పెంచుకున్నాడు. ఒక పిశాచంలా  దాపురించాడు చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు.

జల జగడంతో రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవాలని బాబు గోతికాడ నక్కలా కాచుక్కూచున్నాడు. ఎల్లో మీడియా, ఆ పార్టీ చోటా మోటా లీడర్లు బాధ్యత లేకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కేంద్రం న్యాయం చేస్తుందనే భావిస్తున్నాం అంటూ అంత‌కు ముందు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top