చంద్రబాబు గారూ.. జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి..?

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేపల్లి:  శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అడ్డమైన విషయాలపై జూమ్ లో  మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?  మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
 

Back to Top