అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:   టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆ పార్టీపై చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మే అనిపిస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది. టీడీపి తెలంగాణా అధ్యక్షుడు తెరాసలోకి జంప్ అట. ఇక్కడ కూడా అలాంటి గందరగోళమే ఉంది. జూమ్ మీటింగులతో పిచ్చెక్కి పోయిన నేతలు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తమ ఫ్యూచర్ నాశనం అవుతుందని టెన్షన్ పడుతున్నారంట. అచ్చెన్నే నాయకత్వం వహిస్తాడా తిరుగుబాటుకు? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థ దేశానికి ఆదర్శంగా మారుతోంది. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల కోవలోనే అన్ని రాష్ట్రాలు గ్రామ పంచాయతీ స్థాయిలో 59 రకాల సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని విజ‌య‌సాయిరెడ్డి అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top