పేదలకు సహాయం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 
 

విశాఖ : లాక్‌డౌన్‌ వేళ ఆపదలో ఉన్న పేదలకు నిత్యావరసరాలు, అన్నదానాలు చేస్తున్నవారందరికి వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నపిల్లలు, స్తోమత లేనివారు సైతం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పంపిస్తూ గొప్ప మనసును కనబరుస్తున్నారని ప్రశంసించారు. సాటి పౌరుల పట్ల వారికున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు. ఆపద సమయంలో పేదలకు సహాయం చేస్తున్న వారందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. 
 
ఇంతకంటే అనువైన సమయం దొరకలేదా మీకు?
 ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రభుత్వం వెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని కన్నా, సిపిఐ రామకృష్ణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తుంటాడు. రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు? అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top