14 ఏళ్లు సిఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొల‌గించి..

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విజ‌య‌వాడ‌: అసమర్దుడయిన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంసరచనకైనా సిద్ధమేనని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 14 ఏళ్లు సిఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు. మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసేయ్ బాబూ అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

దేశ రక్షణ కోసం 14 ఏళ్ళు కవచంలా నిలబడి, విధి నిర్వహణలో మృతి చెందిన వీర జవాన్ మంచు రెడ్డప్ప నాయుడు గారి అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో జరిగాయి. వారి కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షలు ఆర్థికసాయం అందించటం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ విజ‌య‌సాయిరెడ్డి కొద్దిసేప‌టి క్రితం మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top