పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు కాదా మీవి?

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు  మీవి కాదా? అంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతలను విమర్శించారు. సోమవారం విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.  నెలలో మూడుసార్లు ఫ్రీ రేషన్ ఇస్తే, ఇంకా అన్న క్యాంటీన్లు తెరవాలని రాద్దాంతం చేస్తున్నారు. అది 100 కోట్ల స్కామ్. క్యాంటీన్ల పేరుతో నిర్మించిన షెడ్లలో ఎవరెంత దోచుకున్నది త్వరలోనే బయటపడుతుంది. పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు కాదా మీవి? అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అందుకే సిఎం జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
కరోనా కష్టకాలంలో ఒడిషా వలస కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుకు నవీన్ పట్నాయక్ సిఎం జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అయితే, కార్మికులు స్వరాష్ట్రానికి వెళ్లడానికి ఇష్టపడలేదని, తమకు బాబు లాంటి సిఎం లేనందుకు బాధపడుతున్నామని అన్నట్టు ఎల్లోమీడియా చెలరేగేది అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.

Back to Top