అప్పటి చంద్ర‌బాబు భాష‌.. ఇప్పుడు అచ్చెన్న భాష ఒకేలా ఉన్నాయి 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్  
 

న్యూఢిల్లీ:  పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బెదిరించ‌డంపై స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

"ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌తో ‘ఫర్ ఎవ్రీథింగ్, ఐయామ్ విత్ యూ’ అని చంద్రబాబు మాయ చేయడం, నిమ్మాడలో నామినేషన్ వేయొద్దని అప్పన్నకు చేసిన ఫోన్‌ కాల్‌లో అచ్చెన్న వాడిన భాష ఒకేలా ఉన్నాయి. ‘నీకు అన్యాయం జరిగింది. ఇకపై బాగా చూసుకుంటా’ అంటున్నాడు. ఎంతైనా బాబు ట్రెయినింగ్ కదా!" అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top