‘అవినీతి పునాదుల మీద లేచిన బతుకులు మీవి'

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
 

విశాఖ‌: ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్‌ తీరుపై ట్విటర్‌ వేదికగా వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘‘తండ్రీకొడుకులు 'అవినీతి' గురించి మాట్లాడుతుంటే గుంటనక్కలు నీతి బోధలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. అవినీతి పునాదుల మీద లేచిన బతుకులు మీవి’’ అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ‘అహింస, న్యాయం, ధర్మంపై నక్కలు ఊలపెడితే అసహ్యంగా ఉంటుంది. అగాధంలోకి జారిపడి, శిఖరంపై ఉన్నవారిపై ఉమ్మి వేయాలని చూస్తే మీ మీదే పడుతుందని’’ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top