దేశానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్  ప్రాణ వాయువు అందించింది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్  ప్రాణ వాయువు అందించింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే దేశానికి ఇంతటి సేవలు అందించగలిగేదా? ఒక్కసారి ఆలోచించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇటీవల కోరడం జరిగింద‌ని విజ‌య‌సాయిరెడ్డి బుధ‌వారం ట్వీట్ చేశారు. 

ఇంతకు ముందు శంకుస్థాపన చేసిన పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు కాక మరో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి సిఎం శ్రీ వైయ‌స్ జగన్ గారు వర్చువల్ విధానంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 16 మెడికల్ కాలేజిలు 8 వేల కోట్లతో 3 ఏళ్లలో పూర్తిచేస్తారు. పాత వాటితో కలిపి కాలేజిల సంఖ్య 25కు చేరుకుంటుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top