భగవంతుడి దయతో కోలుకున్నాను

కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలి

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 

తాడేప‌ల్లి:  భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను' అని విజయసాయిరెడ్డి  ట్వీట్ చేశారు.  ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top