కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా ఎల్లో మీడియా కథనాలు  

సీఎంలు వైయస్‌ జగన్, కేసీఆర్ చర్చలపై ఎల్లో మీడియా విషం చిమ్మింది

 ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

అమరావతి:  రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కేసీఆర్ చర్చలు జరిపితే ఎల్లో మీడియా విషం కక్కిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నదీ జలాల వినియోగం, విభజన అంశాలపై మాట్లాడితే విషం చిమ్మిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎంల అసంతృప్తి అంటూ కథనాలు రాసి కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఎంత నీచానికైనా ఎల్లోమీడియా దిగజారుతుందని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి స్పందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top